దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. ఇప్పటికే వరద నీటితో ఉన్న ఢిల్లీకి భారత వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ
హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మధ్యంతర సహాయంగా కేంద్రం నుండి రూ. 2,000 కోట్లు కోరారు.
నైరుతు రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా 145 మందికిపైగా మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.…
దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటేత్తుతుంది.. చాలా ప్రాంతాలు ఇంకా జల దిగ్బదంలో ఉన్నాయి..ఎవరైనా వచ్చి సహాయం అందించాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు..వరదల్లో చిక్కుకున్న వ్యక్తుల కోసం ఆహార పదార్థాలు, సరుకులు లాంటివి విమాన సహాయంతో అందిస్తున్న విషయాలను అప్పుడప్పుడు వినే ఉంటాం. అయితే ఓ వ్యక్తి భారీ వరదల్లో కూడా ఎంతో హాయిగా,…
పాకిస్థాన్‌లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) నివేదించింది.
మన దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది.. పలు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు నగరాలన్ని కూడా జల దిగ్బెందంలో ఉన్నాయి.. ఎటు చూసిన నీళ్ళే కనిపిస్తున్నాయి.. డీల్లీలో 42 ఏళ్లలో ఎప్పుడూ పడని విధంగా భారీ వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు..పొంగిపొర్లుతున్న నదుల్లో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్షపు నీటిలో ప్రజల ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కార్లు,…
గత నెల నుంచి పాకిస్తాన్‌లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.