CM Jagan: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం చేపట్టిన ముఖ్యమంత్రి.. పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్ష ప్రభావం, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రాధానంగా చర్చ జరిగింది. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఇప్పటికే ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: KA Paul : ప్రజలు చూపంతా మా పార్టీ వైపు ఉంది
Also Read
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని చెప్పారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా జగన్ ఆరా తీశారు. 42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని ఈ సందర్భంగా సీఎం జగన్ కు అధికారులు తెలిపారు.
Read Also: Champaran Mutton Recipe: చంపారన్ మటన్‌ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోండిలా..!
అయితే, ఇప్పటికే పలు జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు, అలాగే ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!