కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద తరలివస్తోంది. దీంతో.. మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉదృతి నెలకొంది. బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 3,27,692 క్యూసెక్కులు కాగా.. కాలువలకు 14,692 క్యూసెక్కుల వరదనీరు తరలించారు. బ్యారేజ్ లెవల్ 12.0 కు చేరింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.…
ఓ వైపు గోదావరి.. మరో వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నాయి.. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగార్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తుందో.. దీంతో క్రమంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతూ పోతోంది.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది.. అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. ఇన్‌ఫ్లో రూపంలో…
వారం రోజులుగా కురుస్తున్న వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో రహదాలు స్తంబించాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ముప్పును ఎదుర్కొంటోంది. కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలో.. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో.. ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది. అయితే.. రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక…
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది..…
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ లలో భారీగా వరదనీరు చేరడంతో.. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామెజీపేట- భూపతిపూర్ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. రెండురోజుల క్రింతం షిప్ట్ డిజైర్ కారు ఈ వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్ కవరేజ్‌కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్…
జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీంతో, వదరలు విరిచుకుపడ్డాయి.. దీంతో 15 మందికి పైగా భక్తులు మృతిచెందారు.. మరో 40 మందికి పైగా గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు చర్యలు కొనసాగిస్తున్నాయి.. ఇక, అమర్‌నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు.. అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరిన వెళ్లిన రాజా సింగ్…
అమర్‌నాథ్ ఒక్కసారిగా వదరలు విరుచుకుపడ్డాయి.. దీంతో 15 మందికి పైగా భక్తులు మృతిచెందగా.. మరో 40 మందికి పైగా భక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇక, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అమర్‌నాథ్‌లో వరదలో బీభత్సం సృష్టించిన సమయంలో 12 వేల మంది వరకు…
రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షం కురిస్తే ఫర్వాలేదు. కానీ, ఎప్పడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతిలో ఎటు చూసినా వర్షం, వరద తప్పించి మామూలు నేల కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పిల్లలు కొందరు వరద నీటిని స్విమ్మింగ్‌పూల్ గా భావించి ఈత కొడుతున్నారు. Read: భారీగా…