రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాకుండా.. జలపాతాల వద్ద సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జైపూర్‌కు సమీపంలోని కనోటా డ్యామ్ కూడా నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది. అయితే.. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు ఈ డ్యామ్ చూసేందుకు వచ్చారు. కాగా.. డ్యాం సందర్శనకు వచ్చిన వారిలో ఐదుగురు యువకులు డ్యామ్ నీటిలో కొట్టుకుపోయారు.
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Assam Flood : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అస్సాం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 24 లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ప్రజల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి.
Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ రాజధానిలో ఆదివారం ఉదయం మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి పరిస్థితులు తలెత్తాయి.
అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. మేఘాలకు చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ఇటానగర్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.
Saudi Arab : సౌదీ అరేబియాలో గత 24 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలు దేశవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్నాయి. కొంతకాలం క్రితం దుబాయ్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించింది.