ఓ వైపు గోదావరి.. మరో వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నాయి.. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగార్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తుందో.. దీంతో క్రమంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతూ పోతోంది.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది.. అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. ఇన్‌ఫ్లో రూపంలో 3,98,643 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుండగా.. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. కృష్ణా నది దిగువన, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. ఇక, సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు..
Read Also: Jio New Plan: జియో కొత్త ఆఫర్.. ఒక్క రీచార్జ్‌తో రెండు..!
ఇక, శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.. జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 4,35,149 క్యూసెక్కులుగా ఉంటే.. ఔట్ ఫ్లో 4,39,037 క్యూసెక్కులుగా ఉంది.. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో 4,19,673 క్యూసెక్కులుగా ఉంటే.. 26 గేట్లు పది ఫీట్ల మేర ఎత్తి దిగువకు 4,19,673 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రతీ అరగంటకు నీటిమట్టం పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.