Indonesia : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారు. ఏడుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Australia: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో వినాశకరమైన వర్షాలు సంభవించాయి. దీని తరువాత వరదలు సంభవించాయి.
రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు.
గుజరాత్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. నేడు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల దాటికి కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు మునిగిపోయాయి.
ఓ వ్యక్తి ప్రవహించే వరదలో కారు నడుపుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కొండ ప్రాంతం.. అక్కడ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వీడియోలో వరదలో నుంచి ఎలా వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ప్రవహిస్తున్న నదిని లెక్కచేయకుండా వాహనాన్ని ముందుకు పోనిస్తున్నాడు. చిన్న పొరపాటు జరిగినా తన పరిస్థితి ఏమవుతుందో అని అస్సలు భయపడడు.
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది.