శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కుల దిగవకు పడిపోయింది.. అయినా.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ఇన్ ఫ్లో 2,83,141 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 3,65,487 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు…
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాఫర్ డ్యామ్ దగ్గర నీటిమట్టం 27 మీటర్లకు చేరింది. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు చేరింది. వరద నీరు పెరుగుతుండటంతో ఆలయంలోకి భక్తులను నిరాకరించారు. దేవీపట్నం మండలంలోని…