జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీంతో, వదరలు విరిచుకుపడ్డాయి.. దీంతో 15 మందికి పైగా భక్తులు మృతిచెందారు.. మరో 40 మందికి పైగా గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు చర్యలు కొనసాగిస్తున్నాయి.. ఇక, అమర్‌నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు.. అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరిన వెళ్లిన రాజా సింగ్ కుటుంబం వెనుదిరిగింది. అయితే, అమర్‌నాథ్‌లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు.. గత 3 రోజులుగా అమర్‌నాథ్ మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన ఆయన.. హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని.. కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణం అయినట్టు వెల్లడించారు.. ఇక, వరదలపై ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారిగా వరద వచ్చింది, నా కళ్ల ముందే చాలా మంది కొట్టుకుపోయారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Marriage Cancel: రెండడుగులు పూర్తయ్యాక వధువు షాక్