రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షం కురిస్తే ఫర్వాలేదు. కానీ, ఎప్పడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతిలో ఎటు చూసినా వర్షం, వరద తప్పించి మామూలు నేల కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పిల్లలు కొందరు వరద నీటిని స్విమ్మింగ్‌పూల్ గా భావించి ఈత కొడుతున్నారు.
Read: భారీగా ధ్వంసమైన శ్రీవారి మెట్టుమార్గం…
తామేమి తక్కువ కాదన్నట్టుగా మహిళలు కూడా వరద ప్రవాహన్ని జారుడు బల్లగా భావించి జారుకుంటూ వెళ్తున్నారు. ఇక తిరుపతి నగరంలో కొంతమంది యువకులు వరద నీటిలో రోడ్డుమీద వాలిబాల్ ఆడుతూ కనిపించారు. ఎప్పుడూ లేని విధంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కొంతమంది ప్రజలు భయపడుతున్నా, యువత మాత్రం ఇలా జాలీగా వరద నీటిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తిరుమల గిరులపై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవాహంలా కిందకు జారుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. 25 ఏళ్లుగా తాను తిరుపతిలో ఉంటున్నానని, ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూడలేదని ఓ నెటిజన్ చెప్పడం విశేషం.