హెచ్పీసీఎల్ అగ్నిప్రమాదం పై విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నేడు ఆ నివేదికను కలెక్టర్ వినయ్ చంద్ కు అందజేసే అవకాశం ఉంది. సీడీయు-3లో పైప్ లైన్ దెబ్బ తినడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారణ చేసింది. పైప్ లైన్ బయటకు సరిగ్గానే కనిపించినా లోపల దెబ్బతినడాన్ని గుర్తించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది కమిటీ. పైప్ లైన్ బలాన్ని నిర్దారించే హైడ్రో టెస్ట్ ఎప్పుడు నిర్వహించారు, ప్రమాదం తీవ్రత పెరగకుండా ఎటువంటి చర్యలు…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో.. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వరిత గతిన ఆక్సిజన్ తరలింపునకు ప్రత్యేక రైళ్లు, విమానాలు నడుపుతోంది ప్రభుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గమనించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద…
విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా, అర్ధరాత్రి సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు…
విశాఖపట్నం హెచ్పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు.…
హైదరాబాద్లోని నారాయణగూడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగూడాలోని అవంతి నగర్లో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సడెన్ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఆగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేమైనా కారణాలు…
“జోధా అక్బర్” సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు (మే 7)న కర్జాత్లోని ఎన్డి స్టూడియోలో “జోధా అక్బర్” చిత్రం కోసం నిర్మించిన శాశ్వత సెట్ లో మంటలు చెలరేగాయి. మొత్తం సెట్ నిప్పుల్లో కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించిన చారిత్రాత్మక…
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి.
విశాఖపట్నంలోని మధురవాడలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిత్య ఫార్చూన్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ప్లాట్ నెంబర్ 505 లో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. అయితే, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు…