తైవాన్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తైవాన్‌లోని కావోష్యాంగ్ నగరంలో 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. నగరంలోని 13 అంతస్తుల భవనంలో కింది అంతస్తుల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తుండా, పై అంతస్తులు నివాసాలుగా ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందరూ గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య భారీగా ఉన్నది. అయితే, అగ్నిప్రమాదానికి కారణాలు ఎంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. ఒకవైపు చైనా నుంచి తైవాన్‌ను ముప్పు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆ దేశాన్ని మరింత కలవరపెడుతున్నది.
Read: లైవ్: దేశంలో బొగ్గు కొరత ఉన్నట్టా? లేనట్టా? విద్యుత్ సంక్షోభం తప్పదా?