సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ జనరేటర్ లో మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఫిలింనగర్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ జనరేటర్ వాహనం నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వాహనంలో డీజిల్ లీక్ కావడంతో రోడ్డు పక్కన వున్న కారు, షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. షూటింగ్ వాహనానికి దగ్గరగా, రోడ్డు పక్కన ఆగివున్న హొండా ఐ20 కారు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా ? లేదా అనే విషయం తెలియలేదు. కానీ కారు పూర్తిగా కాలిపోయిన ఫోటోలు, వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి.
Read Also : “ఆర్సీ 15″లో వకీల్ సాబ్ బ్యూటీ