ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే షాహెన్‌బాగ్ ఫైఓవర్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకొని క్షణాల్లో పెద్దవిగా మారాయి. వెంటనే స్పందించిన ప్రజలు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్‌లలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ, నోయిడా మార్గంలో ఈ ఫైఓవర్ ఉండటం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు వాహనాలను దారిమళ్లించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.