కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పివేయగా పక్కనే ఉన్న మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయగా మూడో ఇంట్లోకూడా అదే విధంగా మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. ఇంట్లోని వస్తువులను బయటపడేసి బయటే కూర్చుండిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరులోని ఒకటో వార్డులో జరిగింది. ఈ వార్డులో నివశించే ఖాజావలి, అతని ఇద్దరు కొడుకులు మన్సూర్, ఖలీల్‌లు వరసగా మూడు ఇళ్లలో నివశిస్తున్నారు. ఒకరింటి తరువాత ఒకరింట్లో ఇలా వరసగా మంటలు చెలరేగడంతో ఇంట్లో దెయ్యమో భూతమో ఉందని ఆందోళన చెందుతున్నారు.
Read: హుజూరాబాద్ ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్: రేవంత్ రెడ్డి