విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని కోట పోలినాయుడు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో మంటలు చేలరేగాయి. దీంతో ఒక్కసారి మంటల ఎగిసిపడ్డాడడంతో పక్కనే ఉన్న 20 పూరిళ్ల కు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమయ్యాయి. అంతేకాకుండా పూరిళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలుతున్నాయి. సిలిండర్ పేలుళ్ల శబ్దాలతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం…
విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని అతడి ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. Read Also: బట్టల షాపులోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్.. ఎగిరిపడ్డ యువకుడు ఈ ఘటనలో…
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మరణించారు. ప్రమాదం జరిగిన పిల్లల వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా.. మిగతా 36 మంది క్షేమంగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న పిల్లల బంధువులు వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో…
మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో కరోనా వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. షాట్ సర్య్కూట్ కారణంగా ఈ…
శ్రీకాకుళం జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. శ్రీకాకుళం జిల్లా లెక్కలి పట్టణంలోని కచేరీ వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా.. పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి సాయి మరియు హరిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గాయాల పాలైన ఇద్దరు చిన్నారులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక విషయం తెలిసిన…
దీపావళి సందడి దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. అలాగే, దీపావళి బాణసంచా దుకాణాల్లో పేలుళ్ళు ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10 మంది మంటల్లో చిక్కుకోగా ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కాగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తమిళనాడులోని కల్వాకుర్చి జిల్లా శంకరాపురంలోని బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం పై సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది రెస్క్యూటీం.. సహాయ చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కాగా, భారీ మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక…
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు కాలి బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మంటల్లో కాలిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నేలమర్రి గ్రామానికి చెందిన సన్నకారు రైతు కప్పల లక్ష్మయ్యకు రెండు ఎకరాల పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం తన తండ్రికి చెందిన ఆస్తి అమ్మడంతో…
గుజరాత్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సూరత్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కులు తయారు చేసే పరిశ్రమలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమలో అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. Read:…
తైవాన్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తైవాన్‌లోని కావోష్యాంగ్ నగరంలో 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. నగరంలోని 13 అంతస్తుల భవనంలో కింది అంతస్తుల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తుండా, పై అంతస్తులు నివాసాలుగా ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందరూ గాఢనిద్రలో ఉండగా…