ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి.
Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి
ఈ ప్రమాదంలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. 70 పడకలతో మూడు నెలల క్రితమే ఈ వార్డును ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాజధాని బాగ్ధాద్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ ఘటనలో 82 మంది మృతి చెందగా, 110 మందికి గాయాలయ్యాయి.