హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని నగర అగ్నిమాపక శాఖ తెలిపింది. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు, తరువాత నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు నిర్ధారించారు. కనీసం 15 మంది గాయపడినట్లు తెలిపారు. దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also Read:RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ…
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు…
Hyderabad Fire Accident: హైదరాబాద్ నగరంలోని మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపో (ICD)లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
Indore: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని జూన్ థానా పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఒక ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, కుటుంబంలోని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. శహజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అదే ఇంట్లో అతను ఒక చిన్న గోదాం కూడా ఏర్పాటు చేసుకున్నాడు.…
71 Dead in Afghanistan Bus Accident: అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 17 మంది చిన్నారులతో సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ప్రావిన్స్ అధికారులు బుధవారం ఎక్స్‌లో ధృవీకరించారు. ట్రక్కు, మోటార్ సైకిల్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు. Also Read: Horoscope Today: బుధవారం…
Kesamudram: కేసముద్రం రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లో నిలిపివేసిన ఓ రెస్ట్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో కోచ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నారు. వారు చాకచక్యంగా స్పందించి వెంటనే కంపార్ట్మెంట్ తలుపులు తెరిచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు…
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.
Fire Accident: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్వీరో వెస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. Read Also:Venkaih Naidu : గొప్ప…
Chennai: చెన్నై తిరువళ్లూరు సమీపంలో ఇంధనంతో వెళ్తున్న సరుకు రవాణా ( గూడ్స్) రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టు నుండి చమురుతో వెళ్తున్న సరుకు రవాణా రైలులో అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయని సమాచారం. ఎగసిపడుతున్న మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కప్పబడి ఉంది. రైలులో ఇంధనం ఉన్నందున మంటలు మరింత వ్యాపిస్తాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు. Read Also:Kota Srinivasa Rao: సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో…
Fire : మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండాలో మంగళవారం ఉదయం ఒక దుర్ఘటన భయాందోళన కలిగించింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హేలీప్యాడ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. వాహనం పూర్తిగా దగ్ధం కాకముందే…