భూమిపై అగ్నిప్రమాదాలు జరుగుతుండటం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ, సముద్రం అడుగు భాగంలో అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు బద్దలైనపుడు మాత్రమే అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులా తీరానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అగ్నాకీలలు ఎగసిపడ్డాయి. అయితే అప్రమత్తమైన నావికా సిబ్బంది అరగంటపాటు రెస్క్యూ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. సముద్రం అడుగుభాగంలో ఏర్పాటు చేసిన గ్యాస్‌పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని మెక్సికో చమురు సంస్థ పెమెక్స్ తెలియజేసింది.
Read: సత్యదేవ్ బర్త్ డే ట్రీట్స్ : “తిమ్మరుసు” గ్లిమ్ప్స్… “గాడ్సే” ఫస్ట్ లుక్!