హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైరింజన్ల సమాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. అయితే, గోదాంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీల సహాయంతో గోడలు కూల్చివేస్తున్నారు అధికారులు.. గోదాంలో పిచికారీ మందులు మరియు సీడ్స్ ఉన్నట్లుగా తెలుపుతున్నారు స్థానికులు.. అయితే, మంటల్లో నుండి పెద్దశబ్దాలు వస్తుండటంతో ఇంకేమైనా కెమికల్ లాంటి పదార్థాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.