ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో దారుణం చోటుచేసుకుంది. అల్జీరియాలోని కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సడెన్‌గా పలుదఫాలుగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సైన్యం రంగంలోకి దిగి చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మంటల్లో ఇప్పటి వరకు 42 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇంతో 25 మంది సైనికులు, 17 మంది సాధారణ పౌరులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. పౌరులను రక్షించే క్రమంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకున్న వందలాది మందిని సైనికులు కాపాడారు.
Read: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ దృష్టి…