ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…
హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా… 40 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పుట్ పాత్… దగ్గర వేసుకుని.. ఉన్న గుడిసెల్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం ధాటికి గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి.దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగి పక్కపక్కనే ఉన్న 40 గుడిసెలు దగ్ధం అయ్యాయి. Read Also:దేశ తలసరి…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. అయితే ప్రయాణికులంతా బస్సులో నుంచి వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుంది గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి…
దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై…
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్‌ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్‌కు దమ్మాయిగూడకు చెందిన మయూర్‌గా పోలీసులు గుర్తించారు.…
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి…
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో భారీ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఫ్యాషన్ వరల్డ్ మెన్స్ వేర్ లో తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే బట్టలకు సంబంధించిన దుకాణం కావడంతో మంటలు భారీగా చెలరేగి ఆగ్నికీలలు పక్కనే ఉన్న దుకాణాలపై పడి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి…
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రకుల్ షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.…
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయకనగర్ బస్తీలోని పరుపుల గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కమ్మేయడంతో బస్తీ వాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు.…