రైతు సంఘాల నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి వచ్చిన 100 మంది రైతు సంఘాల నేతలు కేసీఆర్ను కలవనున్నారు.. ఇప్పటికే గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్నిపరిశీలించిన రైతు సంఘాలు ప్రతినిధులు, మల్లన్నసాగర్, టాంక్ బండ్, పంప్ హౌజ్ను పరిశీలించారు.. ఇవాళ జాతీయ రైతు సంఘం నేత టికాయత్ సహా మరి కొంతమంది నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ రైతు…
రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. మండల, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు విద్యుత్తు సరఫరా సమస్యలపై మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని…
ఓవైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుంటే.. మరోవైపు.. గిట్టు బాటు ధర లేక.. రైతులు పంటను ధ్వంసం చేసే పరిస్థితి నెలకొంది.. కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. దిగుబడి కూడా సంతృప్తికరంగానే ఉంది. అయితే ఉల్లి ధర పడిపోయింది. రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు వ్యాపారులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఉల్లి గిట్టుబాటు…
Fake Organic Fertilizers In Yadadri Bhongir District: యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ ఆర్గానిక్ ఎరువుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో ఆర్గానికి ఎరువులని చెప్పి.. రైతుల (30-40 మంది) నుంచి అక్షరాల రూ. 3 లక్షలు దోచేశారు. ఆదిత్య ఆర్గానిక్ పేరుతో ఓ నకిలీ ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. తమ దగ్గరున్న ఎరువులు కిసాన్ గోల్డ్ మ్యానుఫ్యాక్టర్వి అని నమ్మించి, ఈకో టెక్నాలజీతో జీఎస్టీ లేకుండా బిల్లులు…
రైతులకు ద్రోహం చేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. అమరావతిలో సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయి.. గత ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా?? వీరందరికీ మా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా? అని నిలదీశారు.. దీనిపై దత్త పుత్రుడు…