కృష్ణానదికి పెరుగుతున్న వరదతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లోకి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అకస్మాత్తుగా పడిన గండి భారీ పంట నష్టాన్ని మిగిల్చాగా, పలుచోట ఇల్లు నీట మునిగిపోయాయి.. ఈ ఘటనలో ప్రాణా నష్టం జరగకపోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండిపడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద ఈ సాయంత్రం సాగర్ ప్రాజెక్టుకు గండిపడింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో గండి పడిన విషయాన్ని స్థానికులు గమనించి ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే కాలువ నుండి 5 వేల క్యూసెక్కుల సాగు నీరు ఎడమ కాలవ ద్వారా దిగువకు వెళ్తున్న నేపథ్యంలో కాల్వ నుండి వరద గండిపడిన మార్గం నుండి వేగంగా దిగువకు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తింది.
దీంతో సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వరద ముంచెత్తింది. నిడమానూరు మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ లోకి పూర్తిగా నీరు ప్రవేశించగా.. సమీప గ్రామాలైన లక్ష్మీదేవి గూడెం, నిడమనూరు, ముప్పారం గ్రామాల లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద ఉధృతికి జలమయం అయ్యాయి. నిడమానూరు వద్ద ఉన్న మినీ గురుకుల పాఠశాలలోకి అకస్మాత్తుగా వేగంగా వరద ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైనా వార్డెన్ అక్కడ ఉన్న మొత్తం 87 మంది విద్యార్థులను సమీపంలోని ఫంక్షన్ హాల్ కు తరలించారు. గండిపడిన సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీస్ ప్రాజెక్ట్ అధికారులు హాలియా వద్ద ఉన్న ఎడమ కాలువ వద్ద వాటర్ డైవర్షన్ చేశారు. దిగివకు వెళ్తున్న నీరు కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండడంతో.. ఆ నీరు కూడా వెనక్కి రాకుండా సమీపంలో ఉన్న డైవర్షన్ లను మూసివేశారు.
వరద భారీ పంట నష్టాన్ని మిగిల్చింది. వరద నష్టాన్ని రేపు అంచనా వేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగార్జునసాగర్ హాలియా, నిడమనూరు మీదుగా మిర్యాలగూడ వెళ్లే మార్గాన్ని నిడమనూరు వద్ద డైవర్ట్ చేసి నల్గొండ మీదుగా మిర్యాలగూడ కి వెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు. గండిపడడంతో దాదాపుగా 20 ఇల్లు, మినీ గురుకుల పాఠశాల, ఈ వరదల్లో ముంపుకు గురైంది. ఎక్కడ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. గండిపడటం వల్ల ఎగువ నుండి వస్తున్న నీటిని నిలిపివేసినప్పటికీ.. ఇప్పటికే విడుదలైన మీరంతా గండి ద్వారా బయటికి వెళ్ళడానికి అర్ధరాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడికి అక్కడ మీరు నిల్వ ఉండకుండా చెరువుల్లోకి ఇతర కాలువల ద్వారా పంట పొలాల్లోకి నీరు వెళ్లే విధంగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: Mohammad Nabi: టీ20ల్లో చెత్త రికార్డ్.. తొలి బ్యాటర్‌గా