ఏపీలో త్వరలో కొత్త జిల్లాలలో సహకార బ్యాంకులు రానున్నాయా? అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఏపీలో సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేస్తామని, అందుకు సహకారం అందించాలని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ను కోరామని తెలిపారు మంత్రి గోవర్దన్ రెడ్డి. రైతుల విద్యుత్ వాడకం ఎంత ఉందో తెలిస్తే, సరఫరా చేసేందుకు వీలౌతుంది. నూతన సబ్ స్టేషన్లు, ట్రాన్షఫార్మర్లు పెట్టడానికి వీలుంటుందన్నారు మంత్రి గోవర్థన్ రెడ్డి.
Read Also: Tagore Scene Repeat In Telangana: ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన మహిళకు చికిత్స
నీటి మోటర్లు కు మీటర్లు పెట్టే అంశంపై రైతుసంఘాలకు వివరించాం. ఏపీలో కొన్ని రైతు సంఘాలు రాజకీయ ఎజెండాతో వ్యతిరేకిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఆంధ్ర పేరుతో అన్ని కొత్త జిల్లాల్లో సహకార బ్యాంకులు పెట్టే ప్రతిపాదనలు రిజర్వ్ బ్యాంకు కు పంపామని, అది ఆమోదం పొందితే కార్యరూపం దాలుస్తుందన్నారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్ లో నమోదు చేసుకోవాలని, అలా నమోదుచేసుకోకుంటే దళారుల నుంచి ఒక్క గింజ కూడా కొనుగోలు చేయం అన్నారు మంత్రి గోవర్థన్ రెడ్డి.
Read Also: Kunamneni Sambasiva Rao: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక