Tomota Prices: ఏపీలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటాకు కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమోటాలను తెలంగాణలో మాత్రం పలు ప్రాంతాల్లో కిలోకు 15 నుంచి…
ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు.
వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు.
Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.లక్షలోపు పంట రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్ఆర్ సున్నావడ్డీ రాయితీని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్‌లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 2.54 లక్షల మంది ఖాతాల్లో రూ.45.22 కోట్ల నిధులను అధికారులు జమచేయనున్నారు. రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని నేటి నుంచి…
తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సుకు మంత్రి మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
Tamota Prices: టమోటా ధర మరోసారి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో కేవలం రూపాయే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్కు తరలించేందుకు రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోలు చొప్పున ఉండే 15 గంపల టమోటాలకు పత్తికొండ మార్కెట్కు తెచ్చి విక్రయిస్తే కమీషన్ పోగా రైతులకు మిగిలింది కిలోకు కేవలం రూపాయి మాత్రమేనని వాపోతున్నారు.…
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా సీఎంకు లేఖలు రాస్తూ వచ్చిన రామకృష్ణ… ఈ సారి నకిలీ విత్తనాలు, నష్టపోయిన పత్తి రైతుల గురంచి తన లేఖలో ప్రస్తావించారు.. నంద్యాల కేంద్రంగానే 30 కంపెనీల పత్తి విత్తనాల సరఫరా జరిగినట్లు తెలుస్తోందని పేర్కొన్న ఆయన.. ఎకరాకు దాదాపు రూ.60…