దొంగలకు ఏవీ వదలాలని అనిపించడం లేదు. కాదేదీ చోరీకి అనర్హం అన్నట్టుగా మారిపోయింది సీన్. చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగలు ఇప్పుడు భారీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆవుల్ని దొంగిలించారు ఇద్దరు కేటుగాళ్ళు. ఆవుల్ని ఎత్తుకెళ్ళిన సీన్ సీసీ కెమేరాల్లో రికార్డ్ అయింది. శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవ చెరువు దాదిరెడ్డిపల్లిలో పాడి ఆవులను ఎత్తుకెళ్లిన దొంగల ఉదంతం వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆదొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.
Read Also: Vishnu Priya: నన్ను కోరిక తీర్చమన్నారు.. నేను ఆ పని చేశాను
శ్రీ సత్య సాయి జిల్లాలో జనం దొంగల బెడదతో సతమతం అవుతున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలతో దొంగలు రెచ్చిపోతున్నారు. దీతో కంటిమీద కునుకు కరువయిందని జనం వాపోతున్నారు. చోరీలను అరికట్టడంలో పోలీసులు వైఫల్యం చెందారని విమర్శలు వస్తున్నాయి. ఈ దొంగలు చివరకు పశువులను సైతం వదలడం లేదు. ఓబుల దేవ చెరువు మండలం దాదిరెడ్డిపల్లిలో హనుమంత రెడ్డి అనే రైతుకు చెందిన రెండు పాడి ఆవులను రెండురోజుల క్రితంరాత్రి ఇద్దరు వ్యక్తులు దొంగిలించుకు పోయారు.
ఆవుల్ని ఎత్తుకెళ్లిన దృశ్యం సీసీ ఫుటేజ్ లో రికార్డయింది. తన ఆవులు రెండు కనిపించడం లేదని. దొంగలు ఎత్తుకెళ్లారని రైతు హనుమంత్ రెడ్డి ఓబుల దేవ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ రైతు అందించిన సీసీ ఫుటేజీ రికార్డు ప్రకారం దొంగల ఆచూకీ కోసం పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆవుల దొంగతనం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.
Read Also: Errabelli Dayakar Rao :చుక్కా రామయ్యను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి