గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణను భారీవర్షాలు ముంచెత్తాయి. నీటి ప్రాజెక్టులు అన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కోలుకుంది..ఇన్నాళ్ల పాటు ఆయకట్టు నీటికోసం ఎదురు చూసిన రైతుల కళ నెరవేర బోతుంది..అధికారులు ఇన్ని రోజుల పాటు శ్రమించి గేట్లు కిందకు దింపడంతో ప్రాజెక్టులోకి ఆరు టీఎంసీలకు పైగా నీరు నిల్వ అయింది..దీంతో శుక్రవారం ఆయకట్టు పంటల కోసం కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నెలక్రితం వర్షాలు భారీగా వచ్చిన వరదలతో గేట్లు దెబ్బతిన్నాయి..
దెబ్బతిన్న కడెం ప్రాజెక్ట్ గేట్లు కిందకు దిగలేని పరిస్థితి ఎదురైంది..చెత్తాచెదారం గేట్ల మధ్య ఇరుక్కపోవడంతో ప్రాజెక్టుకున్న 18 గేట్లు కిందకు దిగలేదు. ఈక్రమంలో ప్రాజెక్టులోకి వచ్చిన ఇన్ ఫ్లో అంతా గోదావరి పాలైంది..ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది…అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం ప్రాజెక్టు స్టేటస్ ను నివేదిక సర్కార్ కు ఇవ్వడంతో మెకానికల్ టీం రంగంలోకి దిగి మరమత్తులు పూర్తి చేశారు. అయితే మొన్నటి నుంచి నీరు నిల్వకావడం ప్రారంభం కాగా తాజాగా ఆరు టీఎంసీలకుచేరుకుంది…ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు అధికారులు.
శుక్రవారం సాయంత్రం మంచిర్యాల , ఖానాపూర్ ఎమ్మెల్యే ల తో నీటి విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1573 క్యూసెక్కులు ఉండగా నీటి మట్టం700 ఫీట్లకు గాను ప్రస్తుతం . 693.700 లకు చేరుకుంది.. నీటి సామర్ధ్యం 7.603 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.061 టీఎంసీలకు చేరుకుంది..దీంతో ఆయకట్టు రైతులకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనుండగా రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.