పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టనర్…
పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో గత మూడేళ్లలో 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదు. కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవని అందరికీ తెలుసు.. ఒక్క సీఎం జగన్ కు తప్ప. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి రావటానికి ఇచ్చిన…
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా…
ఏరువాకతో సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా, 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి…
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్దరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి…
జూన్ రెండవ వారం నడుస్తోంది. అయినా చినుకు జాడలేదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రుతుపవనాలు కేరళను తాకేశాయని, మనకు ఈసారి ముందే వానలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అయిదారు డిగ్రీలు అదనంగా పెరగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మే 29న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి…
అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన టీడీపీ నేతలతో చర్చించారు. తన పర్యటనలే కాకుండా.. పార్టీ పరంగా కూడా వివిధ సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. అయితే ముందుగా రైతు సమస్యలపై ఉద్యమిద్దామని టీడీపీ నేతలు సూచించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భేటీలో నిర్ణయించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో…
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకు 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని…
కోనసీమలో క్రాప్ హాలీడేపై అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇచ్చి అమలు చేయకపోతే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు చెబుతున్నారు. దాంతో కోనసీమలో సాగుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో దాదాపు 12 మండలాల్లో రైతులు ఈ ఏడాది సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా డ్రైన్లు సమస్యతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్…