Smartphone Safety Tips: మీ స్మార్ట్ ఫోన్లోకి హోలీ రంగు, నీరు చేరిందా..? ఇలా కాపాడుకొండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smartphone Safety Tips: హోలీ పండుగలో రంగులు, నీటితో ఆడటం సరదాగా ఉంటుంది. కానీ, అదే సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ తడిస్తే పెద్ద సమస్యగా మారుతుంది. నీరు లేదా తడి రంగు ఫోన్లోకి వెళ్లితే సర్క్యూట్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో భయపడకుండా సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ముందస్తు జాగ్రత్తలు: హోలీ ఆడేటప్పుడు ఫోన్‌ను జేబులో నేరుగా పెట్టుకోవద్దు.. వాటర్‌ప్రూఫ్ పౌచ్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచండి.. ఛార్జింగ్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్లను తేలికగా టేప్‌తో కవర్ చేయండి. మీ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ అయినా పూర్తి రక్షణ ఉంటుందని భావించకండి.
Also Read
- OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
- Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
- ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
- Microsoft Outlook Down: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు డౌన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజం కీలక ప్రకటన
* ఫోన్లోకి నీరు వెళ్లితే ఏమి చేయాలి?
– వెంటనే ఫోన్ ఆఫ్ చేయండి.. ఫోన్ ఆన్‌లో ఉంటే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఉంటుంది. వెంటనే పవర్ ఆఫ్ చేయాలి.
– మీ ఫోన్లోకి నీరు చేరితే.. వెంటనే సిమ్, మెమరీ కార్డ్ తీసేయండి.. ఫోన్ కవర్, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ తొలగించండి.
– మీ ఫోన్‌ను పొడి గుడ్డతో తుడవండి.. మృదువైన పొడి గుడ్డతో బయట భాగాన్ని తుడవాలి. గట్టిగా ఊపకండి.
* హెయిర్ డ్రైయర్ ఉపయోగించవద్దు: హెయిర్ డ్రైయర్ వేడి వల్ల లోపలి భాగాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఉపయోగించకండి.
* ఎలా ఆరబెట్టాలి?
– ఫోన్‌ను గాలి చలామణి అయ్యే పొడి ప్రదేశంలో ఉంచండి.
– కనీసం 24–48 గంటలు ఆరనివ్వండి.
– పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఆన్ చేయండి లేదా ఛార్జ్ పెట్టండి.
* బియ్యంలో పెట్టడం సరైన పద్ధతేనా?
చాలామంది బియ్యంలో పెడతారు. కానీ ఇది పూర్తిగా ప్రభావవంతం కాదు. బియ్యం కణాలు పోర్ట్‌లలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. సిలికా జెల్ ప్యాకెట్లు ఉంటే, వాటితో గాలి చొరబడని కంటైనర్‌లో ఫోన్‌ను ఉంచడం మంచిది.
* ఫోన్ ఆరిన తర్వాత కూడా స్క్రీన్ పనిచేయకపోతే, సౌండ్ రాకపోతే, నెట్వర్క్ సమస్య ఉంటే.. వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.. మొత్తంగా హోలీ ఆనందాల పండుగ. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మీ ఫోన్‌ను సురక్షితంగా కాపాడుకోవచ్చు. రంగులతో ఆడండి, కానీ మీ గాడ్జెట్లను రక్షించుకోవడం మరవద్దు.
తాజావార్తలు
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
-
Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
-
Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
-
Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?