ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కుమారుడే తల్లిని క్రూరంగా చంపేశాడు. కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో 12వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాటలు వినకుండా ఆపినందుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింది భాగంలో దాచి పెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కొడుకు ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం…
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపిన ఇద్దరు చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తండ్రే కాలయముడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన చిన్నారుల హత్య వ్యవహారం కలకలం రేపింది. తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు డ్రామాలు ఆడినప్పటికీ.. పిల్లలను చంపి పరారైనట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. మైలవరం చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్. NTR జిల్లా మైలవరం చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్.. తండ్రే ఈ హత్యలు చేసినట్లు నిర్ధారణ.…
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
పెళ్లి తర్వాత భార్యను భర్త.. భర్తను భార్య మోసం చేసుకోవడం ప్రస్తుతం కామన్‌గా మారింది. భర్త తన భార్యను మోసం చేయడం, భార్య వేరొకరి కోసం భర్తను మోసం చేయడం వంటి వార్తలు ప్రతిరోజూ అనేకం వస్తునే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లోని ఆదిత్యపూర్ నగరం నుంచి ఇలాంటి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, నలుగురు పిల్లల తల్లి తన ఇంటిని వదిలి తన ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమె అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడం…
కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక దారుణ హత్య కేసు బయటపడింది. సౌరభ్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడితో కలిసి ఘోరంగా చంపిన విషయం తెలిసిందే. తన భర్త మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో ప్యాక్ చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి మరో కేసు బయటపడింది. ఈ కేసు కూడా ఉత్తరప్రదేశ్‌కి చెందినదే. రాష్ట్రంలోని బల్లియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్‌కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్‌లో మాట్లాడింది.…
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్‌పూర్‌లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే…
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.