ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపిన ఇద్దరు చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తండ్రే కాలయముడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన చిన్నారుల హత్య వ్యవహారం కలకలం రేపింది. తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు డ్రామాలు ఆడినప్పటికీ.. పిల్లలను చంపి పరారైనట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. మైలవరం చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్. NTR జిల్లా మైలవరం చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్.. తండ్రే ఈ హత్యలు చేసినట్లు నిర్ధారణ. తండ్రే ఈ హత్యలు చేసినట్లు నిర్ధారణ.. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రవిశంకర్. కన్న పిల్లలను కర్కశంగా కడతేర్చిన కిరాతకుడు..
Murugan Devotees Meet: నేడు మధురైలో మురుగన్ భక్తుల సమ్మేళనం.. హాజరుకానున్న యోగి, పవన్ !
NTR జిల్లా మైలవరంలో ఈ డబుల్ మర్డర్స్ ఘటన జరిగింది. శరణ్య, లీలా సాయి అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు తండ్రి రవిశంకర్. అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నట్లు లేఖ రాసి పారిపోయాడు. దాదాపు 10 రోజులపాటు రవిశంకర్ జాడ తెలియలేదు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్ మాత్రం ఇబ్రహీంపట్నంలోని కృష్ణా నది ఒడ్డున చూపించింది. దీంతో అతను నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. రవిశంకర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ డెడ్ బాడీ కూడా దొరకకపోవడంతో రవిశంకర్ బతికే ఉన్నాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి..
తాను చనిపోతున్నట్లు సీన్ క్రియేట్ చేసి వెళ్లిపోయిన రవిశంకర్ సింహాచలంలో ఉన్నట్లు పోలీసులు పసిగట్టారు. అంతకు ముందు చాలారోజులపాటు గడ్డం పెంచిన అతను.. అక్కడ గడ్డం తీసి ఎవరూ గుర్తు పట్టని విధంగా తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. కొద్ది రోజులపాటు సెల్ ఫోన్ వినియోగించని రవిశంకర్.. చివరకు కొత్త సిమ్ కార్డుతో మైలవరంలో వాళ్లకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మైలవరం నుంచి సింహాచలం వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో అతన్ని విచారించగా సంచల విషయాలు చెప్పాడు. భార్యపై అనుమానంతోనే ఇద్దరు పిల్లలను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. భార్యపై రవిశంకర్‌కి గతంలో కూడా అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది…
Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?