నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
READ MORE: Bengal Waqf Violence: వక్ఫ్ అల్లర్లలో ముగ్గురు మృతి.. కేంద్ర బలగాలను మోహరించాలని కోర్టు ఆదేశం..
ఏప్రిల్ 4న లిఖిత తన ప్రియుడు అజయ్‌కు ఫోస్ చేస్తుండగా తల్లి సుజాతతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కోపంతో ఉన్న సుజాత, లిఖితను తన ఒడిలో కూర్చోబెట్టుకుని రెండు చేతులతో ఆమె ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసింది. తల్లి చేతుల్లోనే లిఖిత ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇంటికి తాళం వేసి, సుజాత యథావిధిగా తన ఉద్యోగానికి తిరుమలకు వెళ్లిపోయింది.
READ MORE: YSRCP: వైసీపీలో నూతన నియామకాలు.. 33 మంది పీఏసీ మెంబర్లు..
తర్వాత భర్తకు ఫోన్ చేసి “లిఖిత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వెళ్లి చూడండి” అని చెప్పింది. తండ్రి ఇంటికి వెళ్లి చూసే సరికి లిఖిత విగతజీవిగా కనిపించింది. మొదట వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు, అనంతరం విచారణలో నిజం వెలుగులోకి తీసుకొచ్చారు. తల్లి సుజాత గ్రామ పెద్ద సక్కూరి ధనంజయ రెడ్డికి జరిగిన వివరాలను చెప్పి లొంగిపోయింది. తదుపరి విచారణ అనంతరం మర్డర్ కేసుగా నమోదు చేసి, సుజాతను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.