కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక దారుణ హత్య కేసు బయటపడింది. సౌరభ్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడితో కలిసి ఘోరంగా చంపిన విషయం తెలిసిందే. తన భర్త మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో ప్యాక్ చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి మరో కేసు బయటపడింది. ఈ కేసు కూడా ఉత్తరప్రదేశ్‌కి చెందినదే. రాష్ట్రంలోని బల్లియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
READ MORE: Bhatti Vikramarka: దేశంలో ఎక్కడా లేని పథకం రాజీవ్ యువ వికాసం స్కీమ్
వేరే వ్యక్తి ప్రేమలో మునిగిపోయిన భార్య.. తన భర్తను శాశ్వత నిద్రలోకి నెట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి పేరు దేవేంద్ర రామ్. 52 ఏళ్ల దేవేంద్ర రామ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. డిసెంబర్ 2023లో పదవీ విరమణ పొందారు. విధుల నిమిత్తం అతను ఇంటికి దూరంగా ఉండటంతో భార్య మాయ.. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ అయిన అనిల్ యాదవ్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ప్రారంభించింది. ఈ వ్యవహారం కాస్త తన భర్తను తానే హత్య చేసేంత దూరం వెళ్లింది. భార్య మాయ తన ప్రేమికుడు అనిల్‌తో కలిసి భర్త దేవేంద్ర రామ్‌ను అంతమొందించాలనే ప్లాన్ చేసింది. ఇద్దరూ కలిసి పతకం ప్రకారం మర్డర్ చేశారు.
READ MORE: Vishwambara : “జై శ్రీ రామ్” నినాదంతో.. దూసుకుపోతున్న చిరంజీవి ‘విశ్వంభర’ సాంగ్..
పోలీసులు ఎలా కనుగొన్నారు?
బల్లియా ఖరీద్ గ్రామం సమీపంలోని నది ఘాట్‌కు వెళ్లే మార్గం పక్కన ఉన్న ఒక తోటలో మూడు రోజుల క్రితం పాలిథిన్ సంచిలో రెండు మానవ చేతులు, రెండు కాళ్ళు కనుగొన్నారు. సోమవారం, తోట పక్కనే ఉన్న బావిలో మొండెం కూడా బయటపడింది. ఈ మృతదేహం శరీర భాగాలు ఒకే వ్యక్తికి చెందినవని గుర్తించారు. ఈ శరీర భాగాలన్నీ రిటైర్డ్ సైనికుడు దేవేంద్రకు చెందినవని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో చాలా అడ్డంకులు వచ్చాయి. చివరికి మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది.
READ MORE: Khawaja Asif: ఇంగ్లీష్ రాకుంటే ఎందుకు మీడియా ముందుకు..? పాక్ రక్షణ మంత్రి కామెడీ మామూలుగా లేదు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రిటైర్డ్ సైనికుడి మర్డర్‌కి ఆయన భార్య మాయ, అనిల్ యాదవ్ అనే ట్రక్ డ్రైవర్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది. వీరిద్దరూ కలిసి కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతం బహదూర్‌లోని ఇంట్లో దేవేంద్రను దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ఆరు ముక్కులగా నరికారు. సికందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డయారా ప్రాంతంలో వాహనం విసిరేశారు. ప్రస్తుతం వీరిద్దరితో పాటు ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే.. మాయ, అనిల్ యాదవ్ మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగానే రిటైర్డ్ సైనికుడి ప్రాణాలు తీశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. హంతకురాలు మాయ, మృతుడు దేవేంద్ర రామ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు జైపూర్, రెండవ కూతురు నోయిడా, కొడుకు కోటాలో చదువుకుంటున్నారు.