Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని…
Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్‌లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ…
Murder : తల్లి లేకపోవడం తండ్రి హత్యకు గురవడంతో మైనర్లు అయిన వారి కుమార్తెలు అనాథలయ్యారు. ఏలూరుకు చెందిన వెంకటకనకరాజుకు ముగ్గురు ఆడపిల్లలు ఆయన భార్య ఎనిమిదేళ్ల కిందట మరణించింది. అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. ఏలూరులోని రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి కింద కన కరాజు హత్యకు గురయ్యారు. పెద్ద కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదని కక్ష గట్టిన నాని అనే యువకుడు ఆయనను కత్తితో పొడిచాడు. కనక రాజు మృతదేహానికి సర్వజన…
Sandhya Theatre: పుష్ప-2 ప్రీమియర్ (డిసెంబర్ 04) సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడి, 12 రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటనలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇందులో కేసులు నమోదు అవడం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్,…
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12ఏళ్ల చిన్నారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలియరాని కారణాలతో బాలుడు సాయి హర్ష ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లి ఉద్యోగ విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.
Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి. డాక్టర్ అజయ్ కుమార్…
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు