పెళ్లి తర్వాత భార్యను భర్త.. భర్తను భార్య మోసం చేసుకోవడం ప్రస్తుతం కామన్‌గా మారింది. భర్త తన భార్యను మోసం చేయడం, భార్య వేరొకరి కోసం భర్తను మోసం చేయడం వంటి వార్తలు ప్రతిరోజూ అనేకం వస్తునే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లోని ఆదిత్యపూర్ నగరం నుంచి ఇలాంటి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, నలుగురు పిల్లల తల్లి తన ఇంటిని వదిలి తన ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమె అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడం ప్రారంభించింది. కానీ.. ఆమె భర్త ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.
READ MORE: Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో భారీ వర్షం.. దెబ్బతిన్న అశోక్‌నగర్ మెట్రో స్టేషన్
కులుపతంగ నివాసి భోలా అలియాస్ రితేష్ బిరువా (35), బాగ్బెడ నివాసి రాజేంద్ర మార్డి భార్య సీతా మార్డితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. సీత తన భర్తను విడిచిపెట్టి.. కులుప్తంగాలోని భోలా నివాసంలో అతనితో కలిసి నివసించడం ప్రారంభించింది. ఆమె తన నలుగురు పిల్లల గురించి కూడా పట్టించుకోలేదు. దీంతో సీత భర్త రాజేంద్ర చాలా బాధపడ్డాడు. ఆమెపై కోపంతో ప్రేమికుడి ఇంటికి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా వచ్చాడు. ఆ మహిళ తన ప్రియుడితో కలిసి నిద్రపోతోంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్య, ఆమె ప్రియుడిపై గొడ్డలితో దాడి చేశాడు.
READ MORE: ISRO: ఈ శాటిలైట్ ద్వారా పాకిస్తాన్ రాత్రి ఏం చేస్తుందో కూడా చూడొచ్చు.. రేపే ప్రయోగం..
ఈ దాడిలో ఆ మహిళ ప్రేమికుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న.. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పంచనామా సిద్ధం చేసి.. పోస్ట్‌మార్టం కోసం పంపారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు చేపట్టారు.