ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కుమారుడే తల్లిని క్రూరంగా చంపేశాడు. కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో 12వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాటలు వినకుండా ఆపినందుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింది భాగంలో దాచి పెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కొడుకు ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.
READ MORE: Drugs Case : డ్రగ్స్ కేసులో తెలుగు నటులతో సంబంధమున్న తమిళ నటుడు అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌లోని రావత్‌పూర్ ప్రాంతంలో ఊర్మిళ రాజ్‌పుత్ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇద్దరు పిల్లలు ఆమెతోనే ఉంటున్నారు. సమాచారం ప్రకారం.. ఊర్మిళ తన మొదటి భర్తతో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు12వ తరగతి చదువుతున్నాడు. రెండవ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం, పెద్ద కొడుకు ఇంట్లో ఉండగా చిన్న కొడుకు పాఠశాలకు వెళ్లాడు. తల్లి పెద్ద కొడుకును పాత్రలు కడగమని చెప్పి, బీపీ మందు వేసుకుని నిద్రపోయింది ఊర్మిళ. పెద్ద కొడుకు పాటలు పెట్టుకుని సౌండ్ బాగా పెంచాడు. సౌండ్ తగ్గించాలని ఆమె కొడకుకు చెప్పింది. మాట వినకపోవడంతో ఊర్మిళ స్పీకర్‌ను పగలగొట్టింది. ఆ బాలుడు కోపంతో తన తల్లిని తోసేశాడు. దీంతో ఆమె ముక్కు పగిలిపోయి రక్తం వచ్చింది.. ఈ విషయాన్ని తన తల్లి అందరికీ చెబుతుందేమోనని భయపడిన పెద్ద కొడుకు దుప్పట్టాను తల్లి గొంతుకు బిగించి, మృతదేహాన్ని మంచం లోపల దాచాడు.
READ MORE: Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటనలో రాజకీయ కుట్ర కోణం..!
చిన్న కొడుకు పాఠశాల నుంచి తిరిగి వచ్చి తన తల్లి కోసం వెతికాడు. అమ్మ ఎక్కడ అని తన అన్నయ్యను అడిగాడు. అతను సమాధానం చెప్పలేదు. చాలా సేపు వెతికిన చిన్న కొడుకు మంచం పై భాగాన్ని తెరిచి చూశాడు. అందులో తల్లి మృతదేహం కనిపించింది. పెద్దగా అరవడంతో చుట్టు పక్కల జనాలు అక్కడికి చేరుకున్నారు. ఇంకా ఊపరి ఆడుతోందని భావించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఏసీపీ రంజిత్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. తన తల్లిని తానే చంపినట్లు పెద్ద కొడుకు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. కానీ.. ఈ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయని ఊర్మిళ సోదరీమణులు చెబుతున్నారు. ఊర్మిళ బరువు దాదాపు 90 కిలోలు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమెను ఎత్తుకుని మంచం లోపల ఎలా దాచి పెడతాడు? అని అనుమానం వ్యక్తం చేశారు.