Anantapur: అనంతపురం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
Palnadu: భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలను రోడ్డున పడేశాయి.. బరితెగించిన తల్లి ప్రియుడి కోసం పిల్లలను వదిలేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా... చరవాణిలో పరిచయమైన వ్యక్తి కోసం.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను వదిలేసింది ఓ తల్లి. పిల్లల కోసమైనా.. తిరిగి వెళ్లాలని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ససేమీర అంటోంది. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తతో తరుచూ గొడవ…
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరు డాక్టర్లే.. వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయి. కుటుంబ కలహాలతో వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ హసన్ పర్తిలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రత్యూష అనే వైద్యురాలు. భర్త ప్రేమ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ దంపతులు నగరంలోని రెండు వేర్వేరు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యులగా పనిచేస్తున్నారు. Also Read:Preity Mukundham : ప్రభాస్ పై…
వాళ్లిద్దరూ భార్యాభర్తలు… పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది… తర్వాత అనుమానం రోగం భర్తను వెంటాడింది… పెద్దలు సర్దిచెప్పినా అనుమానం తీరలేదు… చివరకు ఊరు మారితే మనిషి మారతాడనుకున్నాడని భార్య భావించింది… కానీ అనుమానం పెనుభూతంగా మారింది… చివరకు భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి. వెంకటేశ్వర్లుది పల్నాడు జిల్లా బొల్లాపల్లి. అదే మండలం మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారికి…
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.. ఆత్మహత్య చేసుకునేందుకు కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం తాను ఉంటున్న ప్లాట్ నుంచి కార్ తో సహా బయటికి వచ్చింది సోనీ. తన దగ్గరున్న కుక్కను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలి వెళ్ళిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కుమారుడే తల్లిని క్రూరంగా చంపేశాడు. కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో 12వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాటలు వినకుండా ఆపినందుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింది భాగంలో దాచి పెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కొడుకు ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం…
కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరూ మైనర్లు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన బాలికలుగా పోలీసులు గుర్తించారు. మృతుల పేర్లు వినీల (17), అఖిల (16). వినీల ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు.