Wife Protest: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది మొదటి భార్య. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్, శిల్ప దంపతులు 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత ఐదు సంవత్సరాల నుండి భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు భర్త.
Low Birth Weight Babies: తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలు త్వరగా కోలుకునే రహస్యం!
అప్పటినుండి భార్య భర్త కోసం తిరుగుతుండగా.. బండ్లగూడలో నివాసం ఉంటుందని తెలిసి ఇంటికి వెళ్ళింది. అయితే ఆమె రావడంతో లోపల తలుపులు పెట్టుకొని తీయలేదు భర్త. దీనితో ఆగ్రహించిన భార్య భర్త ఇంటి ముందు కూర్చొని ధర్నా చేపట్టింది. దీనితో సమాచారం పోలీసులకు తెలపడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే భార్య అక్కడ విషయం పోలీసులకు చెప్పిన కూడా.. పోలీసులు వచ్చి వెళ్లారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటుంది.
Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
అంతే కాకుండా భర్తను తీసుకెళ్లకుండా నన్ను పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారని.. లేకుంటే అక్కడ నుండి వెళ్లిపోమంటూ చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అన భర్త పైన చట్టరీత్య చర్యలు చేపట్టాలని.. నాకు న్యాయం చేపట్టాలని ఆమె పోలీసులను కోరింది.