భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో ఘటన జరిగింది. మహేష్ అనే వ్యక్తి శ్రీదేవిని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్, శ్రీదేవి దంపతుల మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. మహేష్ నిన్న రాత్రి భార్య శ్రీదేవితోపాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
No Mercy : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, పిల్లల పెళ్లిళ్లు చేశాడు. భార్యను కోల్పోయిన అనంతరం, మిగిలిన జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలని కోరుకున్నాడు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్‌కు 15 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.60 లక్షల నగదును ఇచ్చాడు. అయితే, మహబూబ్…
చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ…
పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. సాయికుమార్ జన్మదినం రోజే హత్య కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.
Murder : రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామానికి చెందిన సుధాకర్ (34), డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన శశికళ తన అవసరాల కోసం సుధాకర్ వద్ద డబ్బు అప్పుగా తీసుకుంది. నిన్న మధ్యాహ్నం సుధాకర్‌కు డబ్బు అవసరం కావడంతో శశికళ ఇంటికి వెళ్లి తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే ఈ విషయంలో సుధాకర్‌కు శశికళ, ఆమె తమ్ముళ్లు మాదరమోని శేఖర్,…
Murder : కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించి, మద్యం వ్యసనానికి బానిసైన ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. మద్యం కొరకు ప్రతిరోజూ భార్యను డబ్బుల కోసం వేధిస్తున్న భర్త, ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది. షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల…
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల…
Murder : మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి, చంపాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు సమాచారం. సీఐ సత్యనారాయణ, సిబ్బంది…
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్‌ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా…