వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరు డాక్టర్లే.. వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయి. కుటుంబ కలహాలతో వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ హసన్ పర్తిలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రత్యూష అనే వైద్యురాలు. భర్త ప్రేమ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ దంపతులు నగరంలోని రెండు వేర్వేరు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యులగా పనిచేస్తున్నారు.
Also Read:Preity Mukundham : ప్రభాస్ పై ‘కన్నప్ప’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ప్రత్యూష భర్త డాక్టర్ అల్లాడి సృజన్ గత కొన్ని రోజులుగా వేరే మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయమై పలుమార్లు భార్య భర్తల మధ్య గొడవలు జరుగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతికి కారణమైన అల్లుడిని శిక్షంచాలంటు ప్రత్యూష కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.