బీజేపీ అధిష్టానం ఆదేశాలు.. స్పెషల్ ఫ్లైట్ రద్దు చేసుకున్న ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.. అయితే, తనతో పాటు.. తన అనుచరులను కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్పించాలని భావిస్తున్న ఈటల.. అందరూ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నారట.. ముఖ్యనేతలతో తనతో పాటు హస్తినకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం నుంచి ఓ సమాచారం వచ్చింది ఈటలకు.. జాయినింగ్‌కి ఎక్కువ మంది రావొద్దని.. కొద్ది మందితోనే ఢిల్లీకి రావాలని ఈటలకు అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది.. దీంతో.. ప్రత్యేక విమానాన్ని రద్దు చేసుకున్నారు నేతలు. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఢిల్లీ వెళ్లినా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోనో… తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా.. పరిమిత సంఖ్యలోనే రావాల్సిందిగా అధిష్టానం సూచించినట్టు సమాచారం. కాగా, గతంలోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఈటల.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. దానికి స్పీకర్ ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి.
Also Read
- Tags
- bjp
- Delhi
- Etela
- Etela Rajender
- Flight
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!