రాష్ట్రం ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్ సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నాను.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా.. నా రాజీనామా తర్వాత అయినా పెన్షన్‌లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని.. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక, పరిపాలన సౌలభ్యం కోసం చల్లూరిని, వావిలలనీ మండలాలు చేయాలని కోరారు.. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాలే.. వెంటనే ఇవ్వాలన్నారు.. మరోవైపు.. ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా కేసీఆర్ వరలా జల్లు సాంప్రదాయమంటూ ఎద్దేవా చేసిన ఈటల.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కరూపాయి ఇవ్వలేదు.. ఎవరూ రాలేదని గుర్తుచేసుకున్నారు.. నా నియోజకవర్గంలో అన్ని ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా గెలిచిన నియోజకవర్గం.. నా నియోజకవర్గంలో మమ్మళ్లీ విడదీసే ప్రయత్నం చేస్తున్నారు… చేశారు… ఇది నీచం అంటూ మండిపడ్డారు.
మిడతలదండు దాడి చేసినట్టు టీఆర్ఎస్ వాళ్లు దాడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల.. మేం గాలికి గెలిసిన వాళ్లం కాదు.. 2004 నుండి ఇప్పటివరకు మెజారిటీతోనే గెలుస్తున్నానని.. 2004లో పది గెలిచాం అందులో ఒకటి హుజూరాబాద్ అని గుర్తుచేశారు. ఇక, నేను పార్టీ పెడుతున్నాంటు విషప్రచారం చేశారు.. ప్రాణం ఉండగానే బొందపెట్టాలని చూశారు.. కానీ, ఆ బొందలో నీ ప్రభుత్వమే పడుతుందని కామెంట్ చేశారు.. ఎన్నికల వచ్చాయి అంటే డబ్బులతో వస్తారు.. కానీ, మా ప్రజల లొంగరని స్పష్టం చేశారు.. ఈటలను గెలిపించుకోవడం అంటే మనం మనం గెలిచినట్టుగా మా ప్రజలు భావిస్తున్నారన్న ఆయన.. తెలంగాణ గ్రామాలలో… గ్రామాలు బాగూంటే బంగారం తెలంగాణ సాధ్యం అని చెప్పాను.. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పిన అది తప్పా? అని ప్రశ్నించారు.. కొంతమంది చెంచగాళ్ళను తయారు చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించిన ఈటల.. 2018 ఎన్నికలలో నా ప్రత్యర్థి కి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.. కరపత్రాలు కొట్టించినా.. డబ్బులు పంపినా ఓపిక పట్టాం అన్నారు. ఇప్పుడు ధర్మ యుద్ధం జరగబోతోంది.. ఈ యుద్ధంలో హుజూరాబాద్ ప్రజలే గెలుస్తారని వ్యాఖ్యానించారు. అఆర్ఎస్ ఎన్ని ఎత్తుగడలు చేసిన డబ్బుల సంచులతో సాధ్యం కాదన్న ఈటల.. మంత్రి గంగుల మాటలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. వాళ్లలాగా డబ్బుని నేను నమ్ముకోలేదన్నారు.. ఇక, హరీష్‌రావుకి ఆత్మగౌరవం ఉందో.. నాకు ఉందో ప్రజలకు తెలుసని కామెంట్ చేశారు ఈటల రాజేందర్.