భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్.. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి చివరకు ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ పెద్దలను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. మళ్లీ విమానంఎక్కి హస్తినకు వెళ్లి కాషాయ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గం హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టిన ఆయన.. తన వెంటన వచ్చిన టీఆర్ఎస్…
ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవని అంటారు. హుజురాబాద్‌లో ప్రస్తుతం అదే పరిస్థితి ఉందట. ఒకప్పుడు నువ్వా నేనా అని కత్తులు దూసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే గూటిలోకి వచ్చారు. అయినప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారట. అదే అక్కడి రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రులు.. ఏంటా పంచాయితీ? లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు! మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా కమలనాథులు సంతోషంగా ఉంటే.. తెరవెనక వారిని కలవరపెడుతున్న…
హుజూరాబాద్ ప్రజలంతా ఈటల రాజేందర్‌కు గోడి కట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్.. హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని వెల్లడించారు.. అయితే, వాపును చూసి ఈటల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈటల చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. రైతు బంధుకు చెక్ తీసుకుని…
ఈటల రాజేందర్ ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. అయితే ఈటల రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ పైన వరుస విమర్శలు చేస్తున్నారు ఈటల. అధికార తెరాస అహంకారానికి హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఇక ప్రగతి భావం లో ఇచ్చిన స్రిప్ట్ చదివే మంత్రులు తమ ఇంట్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలన్నారు. అయితే ఈటల పై తెరాస నాయకులూ కూడా విమర్శల వర్షం గుపిస్తున్నారు. కానీ హుజురాబాద్ లో రానున్న ఉప…
ఈటల ఎపిసోడ్ తర్వాత టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది? మాజీ మంత్రికి సన్నిహితులైన ప్రజాప్రతినిధులవైపు అందరి చూపు పడిందా? ప్రస్తుత పరిణామాలపై మౌనంగా ఉండేందుకే సన్నిహితులు మొగ్గుచూపుతున్నారా? మరికొద్ది రోజులు అలా ఉండటమే బెటర్ అని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నాయకులు? టీఆర్‌ఎస్‌లోని ఈటల సన్నిహితుల దశ దిశ ఏంటి? తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనుచరులతో డిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. గులాబీ…
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని…
టీఆర్ఎస్ను వీడి.. బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు.. అవమానం జరిగిందా? దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జోరందుకుందా? ఇంతకీ ఢిల్లీలో ఈటలకు ఎదురైన అనుభవాలేంటి? సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దృశ్యాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్.. బీజేపీలో ఈటల చేరికపై ఓ రేంజ్లో ట్రోలింగ్ కొద్దిరోజలుగా తెలంగాణ రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చకచకా జరిగిపోయాయి. వివిధ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో ఈటల రాజేందర్ చేరారు. బీజేపీలో రాజేందర్ చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆరేండ్ల క్రితమే ఈటెల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు. బీజేపీలో చేరినందుకు రాజేందర్ ప్రజలకు…
ఈటల బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమస్యను గుర్తించిన ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఢిల్లీ నుండి…