మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఆయన.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్… ఇక, ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన ఈయన.. ఈనెల 14నవ తేదీన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.. కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు.. మరికొందరు నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఆరోజు పార్టీలో చేరే నేతల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది..