తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే నా అజెండా అని ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పటికే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు కురుక్షేత్రంగా అభివర్ణించారు.. అక్కడ కౌరవులు, పాడవులకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు.. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆయన.. కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. చాలా మంది ఫోన్లు చేసి.. ఎందుకు రాజీనామా చేస్తావు అని అడిగారు.. ఉద్యమంలో లేనివాళ్లు కూడా ఇతర పార్టీల్లో గెలిచి.. రాజీనామా చేయకుండా.. టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవులు పొందారు.. అలాంటి సమయంలో మీరు రాజీనామా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు.. కానీ, నేను వాళ్లలా కాదు.. అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.. ఇక, హుజూరాబాద్‌లో జరగనున్న ఎన్నికలకు ఇతర ప్రాంతాల వారు, దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం.. ఆ నియోజకవర్గ ప్రజలకు సపోర్టు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈటల రాజేందర్.