ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని.…
పెద్దనేతలు చేరితే పార్టీ బలోపేతం అవుతుందని సంతోషిస్తారు. కానీ.. ఆ శిబిరంలో రివర్స్. ఒక మాజీ మంత్రి చేరితే.. ఇద్దరు మాజీ మంత్రులు గుడ్‌బై చెప్పేశారు. పార్టీలోనూ అంతర్గత చిచ్చు రగిలిందట. ముఖ్య నాయకుల మధ్యే దూరం పెరిగిందని టాక్. ఆ పార్టీ ఏంటో.. లెట్స్ వాచ్! బీజేపీని వీడిన ఇద్దరు మాజీ మంత్రులు! బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక తర్వాత కాషాయ శిబిరంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆయన కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో…
ఆయన రెండు దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నారు. ఆయన పేరు చెప్పగానే పార్టీ ఏంటో.. పార్టీ గుర్తు ఏంటో ఇట్టే చెప్పేస్తారు ఆ నియోజకవర్గం జనం. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలోకి మారారు. ఎన్నికల గుర్తు కూడా మారింది. త్వరలో జరిగే ఉపఎన్నికలో మరోసారి బరిలో దిగబోతున్నారు. ఈ సమయంలో ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేయడానికి నానా తిప్పలు పడుతున్నారట ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈస్టోరీలో చూద్దాం. బీజేపీ ఎన్నికల గుర్తును…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను అంటే నేను…
హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా సమయం వున్నా ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమములో ఈటలకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. ఈటల తమ గ్రామములో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ…
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ…
మాజీమంత్రి ఈటల రాజేందర్ మరోసారి అధికార పార్టీ టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఉపప్రచారంలో భాగంగా నెరెళ్ళ ఊరిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నెరెళ్ళ ధర్మం తప్పదన్నారు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండి. బీజేపీ పార్టీ జెండాలు పీకెయ్యడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మేము తలుచుకుంటే వేరే ఉంటాడని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయినారు..? కేసీఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం.. దళిత సీఎం…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్.. నా హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడం సంచలనంగా మారింది.. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు.. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. నన్ను నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ ఆయన కామెంట్ చేశారు.. అయితే, ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్.. ఈటల…
మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేసిండన్నారు.. ‘దళిత బందు పథకం’ పెట్టారట సంతోషం.. కానీ ఇంతవరకు దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు అమలు కాలేదని, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు.…