నిరు పేదలు ఏ కులంలో ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… అత్యధికంగా జైలుకు పోయి వచ్చిన బిడ్డ ఈటల. నేను హుజురాబాద్ లో 90శాతం అభివృద్ది చేశాను. మిగిలిన 10శాతం కూడ నా రాజీనామాతో పూర్తి అవుతుంది అని తెలిపారు. నాలాంటి బక్క పలుచని వ్యక్తి మీద కేసీఆర్, అతని అల్లుడు, కుటుంబం, తొత్తులు,…
తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని..…
గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు…
ఉద్యమకారుడు పోచమల్లును టీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు పోచమల్లు తెరాసలోకి వచ్చాడన్నారు. ఈ రోజు గెలిచేది న్యాయం, ధర్మం అని.. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పదన్న ఈటల, ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరిండని హరీష్ రావు కామెంట్స్ చేశారు. తల కిందికి కాళ్లుపైకి పెట్టిన ఈటల గెలవడని మంత్రి…
దళిత బంధు అందరికీ అందించక పోతే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నున్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని కోరారు. 10 లక్షల రూపాయలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలన్నారు. అందరికీ అందించకుండా…
నా రాజకీయ గురువు పెద్ది రెడ్డి. ప్రజలకు అన్నం పెట్టె కులం రెడ్డి కులం. రెడ్డి భవనం కోసం ఎకరం భూమి కోటిరూపాయలు మంజూరు చేసినట్లు హుజురాబాద్ జరిగిన సమావేశంలో గంగుల కమలాకర్ అన్నారు. నేను వ్యవసాయ కుటుంబం లో పుట్టిన వాడినే. నీళ్లు లేక పంటలు వెసుకోలేని రోజుల నుండి బీడుభూములు లేకుండ చేసారు కెసిఆర్. గతంలో పంటలు పండక పోవడంతో ఇంటి తలుపులు తీసుకుపోయాయి బ్యాంకులు. తెలంగాణ రాకముందు రాష్ట్రం గుడ్డి దీపంలాగా ఉండేది.…
హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ బానిస అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేయడంపై…
హుజురాబాద్ నియోజకవర్గములోని వీణవంక మహిళా సమైక్య సంఘాల మీటింగ్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… నా నియోజకవర్గంలోని ఏ ఊరిలోనూ మహిళా భవనం లేకుండా లేదు. వీణవంక మండలంలోని రెండు గ్రామాల్లోనే మహిళా భవనాలు ఉన్నాయి. రూ. 4 కోట్లతో వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనా నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేస్తాము. మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు పని చేసేవాళ్ళం. ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు…
కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్‌రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ…
హుజురాబాద్ లో పద్మశాలి సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… మాజీ మంత్రి ఈటలను ఎన్ని సార్లు పద్మశాలి భవనం అడిగిన ఇవ్వని మాజీ మంత్రి. ఈ రోజు పద్మ శాలీలకు ఒక ఎకరం భూమి కోటి రూపాయలతో భవన నిర్మాణం పత్రాలు ఇప్పించిన ఘనత కేసీఆర్. ఈ భూమిని రెండు రోజుల్లో నిర్మించుకొనుటకు టెండర్లు పిలిచి త్వరలో భవన నిర్మాణం చేపడుతం. ఉద్యమాల్లో జోలె పట్టి కేసీఆర్ ను ఆదుకున్న ఘనత పద్మశాలీలది అన్నారు. ఈ…