తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈటలకు బీపీ, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, షుగర్ లెవల్స్ పెరిగినట్లు గుర్తించారు.. ఇక, ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు.. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్య పరీక్షల తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.