బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ ఎన్నికలో కేసీఆర్ అహంకారాన్ని గెలిపిస్తరా లేదా ఆ అహంకారంతో బలి అయ్యే పేద ప్రజల గొంతుక అయిన ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా అని ప్రజలను అడిగారు. ధర్మం పాతర వేయవద్దనే ఈ వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్న అని ఈటల పేర్కొన్నారు.