ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…
కరీంనగర్ జిల్లా.. ఇళ్ళందకుంట మండల కేంద్రంలోని 5,6,7 వార్డుల్లోని దళిత కాలనీల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళిత భస్తిల్లో ముఖ్యంగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ ఎప్పుడు దళితులను పట్టించుకోలేదు అని అన్నారు మాకు ఒక్క ఇళ్లు కూడ ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పి ఇళ్లు ఇప్పించాలని దళితులు నాతో చెప్పారు. ఇళ్ళందకుంటలో పక్క ఇళ్లు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని…
ఈటల రాజేందర్ కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. డ్రామాలకు పర్యాయ పదం కేసీఆర్ కుటుంబం.. సినీ నటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీష్ రావులని ఆయన విమర్శలు చేశారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హహురాలు కాదా? ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించినట్లున్నారు. మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లుతుందన్నారు.…
ఇళ్ళందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మాట్లాడుతూ… దళిత బంధు పథకం మీద బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. దళితులకు ఏం చేద్దామని నాలుగు సంవత్సరాల క్రితం కేసీఆర్ నన్ను అడిగారు. ఎడారి లాంటి రాష్ట్రం, రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు,ఎన్ కౌంటర్లు ఉన్న తెలంగాణ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది. జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు అన్నరు…
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా…
తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు…
ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రకు తాత్కాలిక విరామం వచ్చింది. పాద యాత్ర 12వ రోజులలో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటల అస్వస్థతకు గురవ్వడం నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశారు. ఈటలకు వైద్యుల పరీక్షల్లో బీపీ 90/60, సుగర్ లెవెల్ 265 గా నమోదయ్యింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపి వేశారు. ఉన్నత వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ తరలించాలని డాక్టర్స్ సలహా ఇచ్చారు. దాంతో ఈటల…